మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే బండారి
_ హెచ్ బి కాలనీ డివిజన్‌లో ఘనం గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
– కాలనీ మహిళలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే
ఉప్పల్, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):
మీర్‌పేట హౌసింగ్ బోర్డు డివిజన్‌లో బి ఆర్ సి పార్టీ మాజీ డివిజన్ అధ్యక్షుడు వంజరీ ప్రవీణ్ కరిప ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు కుటుంబం మరియు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం తదితర రంగాల్లో మహిళలు ముందుకు సాగుతూ తమ ప్రతిభను నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ప్రభుదాస్, శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, స్థానిక నాయకులు, కాలనీ ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Comments