ఖమ్మంలో 'లైఫ్ లైన్ ఫౌండేషన్' టీ-షర్టు ఆవిష్కరణ

పేదలకు సేవ చేయడమే లక్ష్యం: డాక్టర్ కూరపాటి ప్రదీప్

ఖమ్మంలో 'లైఫ్ లైన్ ఫౌండేషన్' టీ-షర్టు ఆవిష్కరణ

​ఖమ్మం బ్యూరో, మార్చి 12(తెలంగాణ ముచ్చట్లు)

నగరంలో సామాజిక సేవే లక్ష్యంగా ఏర్పాటైన 'లైఫ్ లైన్ ఫౌండేషన్' తన కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ఫౌండేషన్ సభ్యులు రూపొందించిన అధికారిక టీ-షర్టులను ప్రముఖ పిల్లల వైద్యులు, అభయ హాస్పిటల్ సీఈవో  డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఆవిష్కరించారు.
​ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి ప్రదీప్  మాట్లాడుతూ.. యువత ఇటువంటి సేవా దృక్పథంతో ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో లైఫ్ లైన్ ఫౌండేషన్ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. సమాజంలో ఇటువంటి సంస్థల అవసరం ఎంతైనా ఉందని, ఫౌండేషన్ చేసే ప్రతి మంచి పనికి తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు.

​ఘన సత్కారం

​టీ-షర్టు ఆవిష్కరణ అనంతరం ఫౌండేషన్ IMG-20260312-WA0034సభ్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు షేక్ జానీ మియా మాట్లాడుతూ.. తమ సంస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని వినూత్న సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
​ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
​షేక్ జానీ మియా వ్యవస్థాపకులు, లైఫ్ లైన్ ఫౌండేషన్, షేక్ ఇమ్రాన్, షేక్ అమీర్, షేక్ మన్సూర్ అలీ, షేక్ జుల్ఫీకర్అలీ, ఎండీ రహీం, షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .