క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 

క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 

ఖాజీపేట,మార్చి10(తెలంగాణ ముచ్చట్లు):

కాజిపేట్ మండలంలోని డీజిల్ కాలనీలో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు క్విస్ట్ కౌన్సిల్ వర్చెస్–2026 పోటీలో ప్రతిభ చాటారు. నిర్వహించిన కాంపిటేటివ్ పరీక్షలో ఐదవ తరగతి విద్యార్థి నీలేష్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. అదే పరీక్షలో అరుణ్ విశాల్, మాన్విత్, భవిష్య, వర్షిత్, ఫాతిమా బేగం, సదృశ్య, మోక్ష, తియాంషి, పూజశ్రీ, భవాని సింగ్, నేతన్, పున్నం చందర్, మాన్విత్, మను వరుణ్, శశిప్రియ, నిరోషిని, ప్రణీత్, గాయత్రీ దేవి తదితర విద్యార్థులు కూడా ప్రతిభ కనబరిచారు.ఈ సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో అమృత విశ్వ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన క్విస్ట్ కౌన్సిల్ వర్చెస్ వేడుకల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గ్రాండ్ ఛాంపియన్స్‌గా ప్రకటించి సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. విద్యా నైపుణ్యాలను ప్రోత్సహించే కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రముఖుల సమక్షంలో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ వట్నాల శ్రీనివాస్, డీన్ కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయానికి కాజిపేట్ శాఖ ప్రధానోపాధ్యాయురాలు నుజహత్, ఉప ప్రధానోపాధ్యాయుడు విజయ్, ఉపాధ్యాయుల కృషి కీలకమైందని పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో కూడా విద్యా రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు నిరంతరం మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.IMG-20260310-WA0139

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .