మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 40 ఆరోగ్య మిత్ర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

_మార్చి 11 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ 

– డీఎంహెచ్‌ఓ డా. ఉమా గౌరి

మేడ్చల్ – మల్కాజిగిరి, మార్చి 10 ( తెలంగాణ ముచ్చట్లు):

జిల్లాలో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ఫీల్డ్ ఆపరేషన్స్‌లో ఖాళీగా ఉన్న ఆరోగ్య మిత్ర పోస్టులను భర్తీ చేయడానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. సి. ఉమా గౌరి తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను హైదరాబాద్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్), సనత్‌నగర్‌లో విధులు నిర్వహించేందుకు నియమించనున్నట్లు పేర్కొన్నారు.మొత్తం 40 ఆరోగ్య మిత్ర పోస్టులను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌తో పాటు డీసీఏ అర్హత కలిగి ఉండాలి. అలాగే కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలని వెల్లడించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా స్థానిక అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని స్పష్టం చేశారు.అర్హత గల అభ్యర్థులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేసి సమర్పించాలి. దరఖాస్తులను మార్చి 11, 12, 13 మరియు 16 తేదీలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు.పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం (డిఎం&హెచ్ఓ కార్యాలయం), ఎఫ్1, ఐడిఓసి, అంతాయిపల్లి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు విద్యార్హత, అనుభవ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు మరియు రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్‌నుజిల్లా  వైద్య & ఆరోగ్య అధికారి, మేడ్చల్-మల్కజ్గిరి జిల్లా” పేరిట జతచేయాలని తెలిపారు.అర్హత గల స్థానిక అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా. ఉమా గౌరి సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .