నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.

 హసన్ పర్తి  కార్పొరేషన్ ఆఫీసు ముందు బై టయింపు.

నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.

 హసన్ పర్తి,మార్చ్ 10( తెలంగాణ ముచ్చట్లు):

 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ హాసన్ పర్తి మండల కేంద్రంలోని రాంనగర్ కు చెందిన మహిళలు త్రాగు నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రోజున ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఎండాకాలం ఆరంభంలోనే త్రాగునీటి సమస్య తీవ్ర తరం కావడంతో సమస్య పరిష్కరించాలని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. కాలనీలో దాదాపు లక్ష జనాభా ఉంటుందని వేసవికాలం ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు తాగునీటి సమస్య తీవ్రతరం అవుతుందని సంబంధిత అధికారులు,రాజకీయ నాయకులు స్పందించి సమస్య తీవ్రతరం కాకముందే పరిష్కరించాలని కోరారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై దేవేందర్ ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .