కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!

కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!

_జవహర్ నగర్ సర్వే నం.415లో తిరిగి నిర్మాణాలు 

– యంత్రాంగం మౌనంపై స్థానికుల ఆగ్రహం

కాప్రా, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):

అక్రమ కట్టడాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలో గతంలో ఆక్రమణగా గుర్తించి కూల్చివేసిన స్థలంలోనే తిరిగి నిర్మాణాలు ప్రారంభం కావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకసారి అక్రమమని తేల్చిన స్థలంలో మళ్లీ పనులు సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అప్పట్లో హడావుడి… ఇప్పుడు నిశ్శబ్దం జవహర్ నగర్ సర్వే నంబర్ 415లో రహదారిని ఆక్రమించి భవనం నిర్మిస్తున్నారని గతంలో స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు గతేడాది ఫిబ్రవరి 17న క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అది ఆక్రమణేనని నిర్ధారించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో భవనాన్ని కూల్చివేశారు. ప్రభుత్వ భూములు, ప్రజా మార్గాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో అధికారులు ప్రకటించారు.మళ్లీ మొదలైన నిర్మాణం కూల్చివేత జరిగిన నెల రోజులకే అదే ప్రదేశంలో మళ్లీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పునాదులు వేసి గోడలు నిర్మిస్తున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. సామాన్యులు చిన్నపాటి నిర్మాణం చేపట్టినా నిబంధనల పేరుతో ఆపే యంత్రాంగం, బహిరంగంగా రహదారిని ఆక్రమిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ IMG-20260310-WA0132నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆక్రమణలను శాశ్వతంగా అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .