అవుట్ సోర్సింగ్ డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహించిన టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం డిపో

అవుట్ సోర్సింగ్ డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహించిన టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం డిపో

ఖమ్మం బ్యూరో, మార్చి 10(తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ఖమ్మం డిపోలో అవుట్ సోర్సింగ్ డ్రైవర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా డ్రైవర్లకు ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించే విధానం, ట్రాఫిక్ నిబంధనలు పాటించే అవసరం, మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని అవగాహన కల్పించారు. అలాగే డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రయాణికులు కోరిన చోట ఎక్కించుకోవడం, దింపడం ద్వారా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ గౌతమి, డిపో ఎంఎఫ్ ప్రవీణ్, డి ఐ అంజయ్య, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .