కాప్రా మండలంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి వేడుకలు

కాప్రా మండలంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి వేడుకలు

_ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహణ 
– మహిళా విద్యకు ఆమె చేసిన సేవలను స్మరించుకున్న నాయకులు

కాప్రా, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కాప్రా మండలంలోని రాధికా ప్రాంతంలో ఎస్ఎఫ్ఐ కాప్రా మండల కమిటీ ఆధ్వర్యంలో భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థినులు మరియు సభ్యులు పాల్గొన్నారు.కార్యక్రమానికి కాప్రా మండల అధ్యక్షుడు శ్యామ్ రావు అధ్యక్షత వహించగా, మండల కార్యదర్శి శ్రీమన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ మెడ్చల్ జిల్లా కార్యదర్శి కార్తిక్ ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలను వివరించారు. కుల వివక్ష, సామాజిక అన్యాయాలను ఎదుర్కొంటూ కూడా బాలికల విద్య కోసం ఆమె ధైర్యంగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులు ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమానత్వం, విద్య హక్కుల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం నిర్వాహకులు అతిథులు, విద్యార్థులు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .