లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

ఎల్కతుర్తి. ఫిబ్రవరి 24(తెలంగాణ ముచ్చట్లు )

ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన పోలీస్ స్టేషన్ సమీపంలోని కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
ఎస్సై అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కనుకుల గిద్ద గ్రామానికి చెందిన తోకల ప్రభాకర్ రెడ్డి, రేణుక దంపతులు పనిమీద హనుమకొండకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో రేణుకకు తీవ్ర గాయాలు కాగా, ప్రభాకర్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని, గాయపడిన రేణుకను 108 అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .