కీసరగుట్టలో యాంకర్ సుమ స్వామి దర్శనం

కీసరగుట్టలో యాంకర్ సుమ స్వామి దర్శనం

_ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందిన కనకాల సుమ రాజీవ్
_తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ పూజారులు
 – భక్తులతో సందడి

కీసర, ఫిబ్రవరి 22(తెలంగాణ ముచ్చట్లు) : 

ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రమైన మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ లో కీసరగుట్ట శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ప్రముఖ టీవీ యాంకర్ కనకాల సుమ రాజీవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో సుమ గారు స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ పూజారులు రవి శర్మ, రమేశ్ శర్మ, ప్రణీత్ శర్మ వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వదించి, అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమం లో ఆలయ ఛైర్మన్ కుమారుడు తటాకం అభిలాష్ శర్మ పాల్గొన్నారు. యాంకర్ సుమ రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు ఆమెతో ఫోటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు.పూజా కార్యక్రమం అనంతరం సుమ  స్థానిక ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .