సేవాలాల్ మార్గమే సమాజ పురోగతికి దిక్సూచి

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

సేవాలాల్ మార్గమే సమాజ పురోగతికి దిక్సూచి

హనుమకొండ,ఫిబ్రవరి 21(తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా గిరిజన భవనంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. సేవాలాల్ ఉత్సవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉప కలెక్టర్ రమేష్ రాథోడ్ పర్యవేక్షణలో, జిల్లా అభివృద్ధి అధికారి ప్రేమకళ సమక్షంలో జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి తొలుత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గొప్ప తాత్వికవేత్త, సామాజిక సంస్కర్త, సమానత్వ సాధకుడని కొనియాడారు. గోర్ బంజారా జాతి ఐక్యత, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన కృషి చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

నాటి హైదరాబాద్ రాష్ట్రంలో బంజారాల వర్తకాలకు స్వేచ్ఛ కల్పించాలని, వారి పశువుల మేతకు ఎలాంటి అడ్డంకులు లేకుండా జీవించే హక్కు కల్పించాలని సేవాలాల్ మహారాజ్ చేసిన ప్రయత్నాలను ఆయన స్మరించారు. విదేశీ పాలకులు బంజారాల జీవనోపాధికి ఆటంకాలు కల్పించిన సందర్భాల్లో ధైర్యంగా ఎదురెదురుగా నిలబడాలని పిలుపునిచ్చిన మహనీయుడు సేవాలాల్ అని వివరించారు. సమ సమాజ నిర్మాణం, నైతిక విలువల పరిరక్షణ ఆయన బోధనల ప్రధాన సారాంశమని తెలిపారు.

మాంసాహారం, మత్తు పదార్థాలు, ధూమపానం వంటి అలవాట్లను విడనాడాలని, నీతి, నిజాయితీ, పరస్పర గౌరవంతో జీవించాలని సేవాలాల్ మహారాజ్ బోధించారని అన్నారు. సేవాలాల్ చూపిన మార్గమే మన మార్గమై ఉండాలని, ఆయన ఆదర్శాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని పిలుపునిచ్చారు.హనుమకొండలోని బంజారా భవన సుందరీకరణకు నిధులు కేటాయించాలని కమిటీ సభ్యులు చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.విశిష్ట అతిథులు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, గిరిజన భవనానికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని కోరారు. గోర్ బంజారాలకు గృహాలు మరియు ఇతర అభివృద్ధి పథకాలు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు,విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లంబాడి సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. జయంతి వేడుకల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సేవాలాల్ ఉత్సవ సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది.IMG-20260221-WA0076

Tags:

Post Your Comments

Comments

Latest News

సేవాలాల్ మార్గమే సమాజ పురోగతికి దిక్సూచి సేవాలాల్ మార్గమే సమాజ పురోగతికి దిక్సూచి
హనుమకొండ,ఫిబ్రవరి 21(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా గిరిజన భవనంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. సేవాలాల్ ఉత్సవ...
పీడిత వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ 
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని నాగ వైష్ణవి బంగారు పతకం
గుజ్జుల రాంగోపాల్ రెడ్డి ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
రాష్ట్ర స్థాయిలో మెరిసిన వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ కుమార్ 
క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి 
వికలాంగులను గౌరవించని వారే అసలైన వికలాంగులు