సోమవారం మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్‌లో ప్రజావాణి కార్యక్రమం

పౌరుల సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష వేదిక

సోమవారం మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్‌లో ప్రజావాణి కార్యక్రమం

మల్కాజిగిరి, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సర్కిల్ కార్యాలయాలు, జోనల్ కార్యాలయాలు మరియు ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది.ప్రధాన కార్యాలయం (ఎం.ఎం.సి), తార్నాక, హైదరాబాద్‌లో కమిషనర్ టి. వినయ్ క్రిష్ణారెడ్డి, ఐఏఎస్ స్వయంగా హాజరై ప్రజల ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఆయన తో పాటు వివిధ శాఖల విభాగాధిపతులు (హెచ్.ఓ.డీలు) కూడా పాల్గొని సంబంధిత సమస్యలపై తక్షణ స్పందన అందించనున్నారు.పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుధ్యం, పన్నులు, భవన అనుమతులు, తాగునీరు వంటి సమస్యలపై ప్రజలు తరచుగా ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో, వాటికి పరిష్కారం చూపేందుకు ప్రజావాణి వేదికగా ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను అవసరమైన పత్రాలతో సమర్పిస్తే త్వరితగతిన పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .