తేజస్విని రెడ్డి వివాహానికి హాజరైన ఐ ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసు
Views: 17
On
వనపర్తి,ఫిబ్రవరి21(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్ రాంమంతపూర్‌కు చెందిన పెసరకాయల స్వప్న కాంతి రెడ్డి ఏకైక కుమార్తె తేజస్విని రెడ్డి వివాహం నగరంలోని నాగోల్ ప్రాంతంలో ఉన్న కళ్యాణ లక్ష్మి గార్డెన్‌లో ఘనంగా జరిగింది.బంధుమిత్రులు, స్నేహితులు, ఆహ్వానితుల సమక్షంలో వివాహ వేడుకలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐ ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.కుటుంబ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.అలాగే పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి, ఎం. బాలరాజ్, కృష్ణయ్య, ఏర్పుల వెంకన్న, డి. అంజన్న, జి. కుర్మయ్య, నారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments