పెద్దమందడి శిశుమందిర్ విద్యాలయానికి గుజ్జుల అశోక్ కుమార్ భూమి విరాళం

పెద్దమందడి శిశుమందిర్ విద్యాలయానికి గుజ్జుల అశోక్ కుమార్ భూమి విరాళం

పెద్దమందడి,ఫిబ్రవరి22(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి గ్రామం మరియు మండలం వాస్తవ్యులు, డిప్యూటీ తహసీల్దార్ పాన్ గల్ శ్రీ గుజ్జుల అశోక్ కుమార్ (కీ.శే గుజ్జుల పెంటయ్య  కుమారుడు, రిటైర్డ్ వీఏఓ)  విద్యాభివృద్ధి పట్ల తమ నిబద్ధతను చాటుతూ పెద్దమందడి శిశుమందిర్ విద్యాలయ నిర్మాణార్థం తమ సొంత భూమిలోని అర ఎకరం (20 గుంటలు) స్థలాన్ని విరాళంగా అందజేశారు.ఈ భూదానం కార్యక్రమం పాలమూరులోని బృందావన్ గార్డెన్ లో నిర్వహించిన శిశుమందిర్ సమ్మేళనం సందర్భంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శిశుమందిర్ ప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుజ్జుల అశోక్ కుమార్  మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన, విలువలతో కూడిన విద్య అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.శిశుమందిర్ విద్యాలయాలు విద్యార్థుల్లో జ్ఞానం, సంస్కారం, దేశభక్తి వంటి విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే సంకల్పంతో ఈ భూమిని విరాళంగా అందజేసినట్లు వెల్లడించారు.శిశుమందిర్ నిర్వాహకులు ఆయన సేవా మనోభావాన్ని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్థలంలో ఆధునిక సదుపాయాలతో విద్యాలయ భవనం నిర్మాణానికి త్వరలోనేIMG-20260222-WA0058 చర్యలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.గ్రామ ప్రజలు, ప్రముఖులు గుజ్జుల అశోక్ కుమార్  దాతృత్వాన్ని ప్రశంసిస్తూ వారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .