ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఆదివారం కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉద్యమకాలంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. అలాగే ఉద్యమకారుల కుటుంబాలకు ఉపాధి, ఆర్థిక భద్రత కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో తమవంతు పాత్ర పోషించిన ఉద్యమకారులను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో ఫోరం రాష్ట్ర మీడియా కన్వీనర్ దొమ్మటి కిరణ్ కుమార్ రావు, నాయకులు దయానంద్, జగన్, ఆదిలక్ష్మి, నాగజ్యోతి, భూపాల్, భాస్కర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .