ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలలో తెలంగాణ ఘనవిజయం

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలలో తెలంగాణ ఘనవిజయం

వనపర్తి,ఫిబ్రవరి22(తెలంగాణ ముచ్చట్లు):

న్యూఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలులో తెలంగాణ హాకీ జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 2–0 గోల్స్ ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది.మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన తెలంగాణ జట్టు ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. జట్టు కెప్టెన్ మన్యం యాదవ్ ఒక గోల్ సాధించగా, సాయి సుందర్ మరో గోల్ చేసి జట్టు విజయానికి కీలక పాత్ర వహించారు. రక్షణ విభాగం కూడా సమన్వయంతో ఆడి గుజరాత్ జట్టుకు గోల్ అవకాశాలు ఇవ్వకుండా కట్టుదిట్టంగా ఆడింది.విజయం సాధించిన తెలంగాణ హాకీ జట్టును తెలంగాణ క్రీడాశాఖ కార్యదర్శి వంశీధర్ రెడ్డి, తెలంగాణ సచివాలయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. జట్టు మేనేజర్ నరేష్ కుమార్, కోచ్ ఆనంద్ మరియు క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే ఉత్సాహంతో ఆడి తెలంగాణ రాష్ట్రానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .