సిద్ధాపూర్‌లో దారుణ హత్య

సిద్ధాపూర్‌లో దారుణ హత్య

ఘటన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ దార కవిత.

మహిళపై కేసు నమోదు,గ్రామంలో ఉద్రిక్తత

హాసన్ పర్తి,ఫిబ్రవరి24(తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండలం సిద్ధాపూర్ గ్రామంలో జరిగిన దారుణ హత్య సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళపై మర్డర్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.డీసీపీ దార కవిత స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం సిద్ధాపూర్‌కు చెందిన బాల్నే రాజ్‌కుమార్ (40) గుమస్తాగా పనిచేస్తూ అతని తండ్రి బాల్నే మొగిలి, తల్లి సరోజన గత 20 సంవత్సరాలుగా హనుమకొండలోని అమృత హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు.వారి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు సిద్ధాపూర్‌లో ఉండగా రాజ్ కుమార్ చిన్నమ్మ వంగ ఇందిరకు ఎవరు లేకపోవడంతో అక్కడే నివసిస్తూ వచ్చినట్లు సమాచారం. మూడు నెలల క్రితంపిర్యాదు దారుని తల్లి సరోజన మృతి చెందడంతో తండ్రి బాల్నే మొగిలి స్వగ్రామానికి వచ్చి తన ఇంట్లో నివసిస్తున్నాడు.ఈ క్రమంలో ఇంట్లో ఉన్న వంగ ఇందిరతో తరచూ గొడవలు జరుగుతున్నాయని,ఇట్టి విషయాన్ని తన కుమారుడు రాజ్‌కుమార్‌కు కూడా పలుమార్లు తెలిపిరాని మంగళవారం రోజున (24-06-2026) ఉదయం రాజ్‌కుమార్‌కు బావమరిది అయిన వంగ సారంగపాణి ఫోన్ చేసి సొంతింటి వెనుక భాగంలో బాల్నే మొగిలి మృతదేహం పడి ఉందని సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకున్న రాజ్‌కుమార్ వచ్చి చూడగా తన తండ్రి ముఖం,నుదురు భాగంలో పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలు ఛాతి,మెడ చుట్టూ కూడా తీవ్ర గాయాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి నట్లు హాసన్ పర్తి పోలీసులు తెలిపారు. ఫిర్యాదుమేరకు వంగ ఇందిరపై హత్య కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ దార కవిత  పరిశీలించి అక్కడ లభ్యమైన ఆధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. కేసును ప్రతి కోణంలో విచారించాలని, ఆధారాల సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. డీసీపీ వెంట హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్ఐ దేవేందర్, రవి తదితర సిబ్బంది పాల్గొన్నారు.IMG-20260224-WA0050

Tags:

Post Your Comments

Comments

Latest News

లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
ఎల్కతుర్తి. ఫిబ్రవరి 24(తెలంగాణ ముచ్చట్లు ) ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన పోలీస్ స్టేషన్...
22 బ్యాంక్ ఖాతాల ద్వారా రూ.547 కోట్ల సైబర్ మోసం.
సిద్ధాపూర్‌లో దారుణ హత్య
వికలాంగునికి అందని పెన్షన్ – పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి
రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించిన పోలీస్ కమిషనర్
ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు
మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ప్రజాప్రతినిధులు