వికలాంగునికి అందని పెన్షన్ – పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి

వికలాంగునికి అందని పెన్షన్ – పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి

వేలేరు, ఫిబ్రవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన కొయ్యడ స్వామి (తండ్రి గట్టయ్య)కు గత నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో పూర్తిగా కుడి కాలు తొలగించాల్సి వచ్చినట్లు తెలిపారు. అప్పటి నుండి శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్న ఆయన వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలిసి వేడుకున్నప్పటికీ సరైన స్పందన లభించలేదన తన సమస్యను పట్టించుకోవడం లేదని స్వామి కన్నీరు పెట్టుకున్నారు.
తాను పని చేయలేని పరిస్థితిలో ఉన్నందున జీవనోపాధి కష్టంగా మారిందని, కనీసం ఇప్పుడు అయినా గ్రామ సర్పంచ్ మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి తనకు వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గ్రామస్తులు కూడా అధికార యంత్రాంగం స్పందించి అర్హులైన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .