విద్యార్థుల ప్రతిభ వెలికితీసేందుకు నేతృత్వ సమావేశాలు

నారాయణ పాఠశాలలో పీపీ1, పీపీ2 విద్యార్థులతో నిర్వహణ

విద్యార్థుల ప్రతిభ వెలికితీసేందుకు నేతృత్వ సమావేశాలు

తార్నాక, మార్చి 9 (తెలంగాణ ముచ్చట్లు):

విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విద్యార్థుల నేతృత్వ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.నారాయణ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల నేతృత్వ సమావేశాల్లో పీపీ1, పీపీ2 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల జీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాల పరమేశ్వరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ఈ విద్యా సంవత్సరంలో నేర్చుకున్న పాఠాలు, గేయాలు, నీతి కథలు మరియు రంగుల గురించి ఇంగ్లీషులో అనర్గళంగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఒకే రంగుతో సంబంధం ఉన్న పండ్లు, పూలు, కూరగాయలు మరియు ఇతర వస్తువులను గుర్తించి చెప్పడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి, బాల పరమేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. చిన్న వయస్సులోనే విద్యార్థులకు మాట్లాడే ధైర్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇవి సహాయపడతాయని పేర్కొన్నారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాల సహాయంతో విద్యార్థులు పండుగలు మరియు వాటి విశిష్టత గురించి వివరించడం గర్వకారణమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్‌డీ హెడ్ మీనా, ఈ-కిడ్జ్ కో-ఆర్డినేటర్ నూర్, ఈ-కిడ్జ్ షాహీన్, ఈ-చాంప్స్ సరిత, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ పూజ, పీఈటీ నరేష్, ఏఓ మహేందర్, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .