వెలుగుమట్ల లో అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తాం
అభివృద్ధి కి మారుపేరు తుమ్మల
–ప్రతిపక్షాలు తుమ్మల పై బురద చల్లే ప్రయత్నం చేయడం తగదు
–ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ప్రతిపక్షాల తీరు మారలేదు
–విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ వడ్డవే నరసింహారావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాధా కిషోర్ ,జిల్లా కాంగ్రెస్ నాయకులు సాదు రమేష్ రెడ్డి
ఖమ్మం బ్యూరో, మార్చి2(తెలంగాణ ముచ్చట్లు)
జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్.
వెలుగుమట్లలోని భూదాన్ భూములలో ఇల్లు కోల్పోయిన అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని రాష్త్ర ఓ బి సి సెల్ ఉపాద్యక్షులు మాజీ కార్పొరేటర్ వడ్డెబోయిన నరసింహారావు ,ఖమ్మం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సాదు రమేష్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, అభివృద్ధి ప్రథాత అయిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అభివృద్ధి అంటేనే తుమ్మలన్నీ గుర్తు చేశారు. మచ్చలేని నాయకుడుగా తుమ్మల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ప్రతిపక్షాలు ఆవాకుల చావాకుల పేలితే సహించేది లేదన్నారు. వెలుగుమట్టలోని భూదాన్ భూములలో అక్రమార్కులు దళారులు పేదవారి దగ్గర డబ్బులు తీసుకొని అక్రమంగా ప్లాట్లు కట్టబెట్టారని దళారులు సొమ్ము చేసుకున్నారని అన్నారు. అర్హులైన పేదలకు న్యాయం చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 1983 నుంచి రాజకీయాలలో మచ్చలేని నాయకునిగా ఎదిగారని ఈ రాజకీయ పార్టీలో ఉన్న నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. నాడు కేటీఆర్ , వడ అజయ్ కుమార్ మంత్రుల ఉండి భూదాన్ భూముల్లో నిరుపేదలకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు కాపాడడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేటీఆర్ కమ్మ వచ్చి రోడ్ షో చేసి వెళ్లారని విమర్శించారు. రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే చేయించి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు మాజీ కౌన్సిలర్ బెడద సత్యనారాయణ, దొడ్డా అశోక్,తాళ్లూరి హనుమంతరావు, జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా సేవాదళ్ అద్యక్షులు సయ్యద్ గౌస్ లు పాల్గొన్నారు.


Comments