స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో హోలీ సంబురాలు

-రంగులు పూసుకుంటూ హోలీ వేడుకలలో విద్యార్థుల ఎంజాయ్.

స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో హోలీ సంబురాలు

 ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు) 

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం ముందస్తు హోలీ సంబరాలు ఆనందోత్సవాలతో జరిగాయి. పాఠశాలలోని వివిధ తరగతుల విద్యార్థులు ఒకరికొకరు సాంప్రదాయ రంగులు పూసుకొని రంగుల పండుగ లో ఎంజాయ్ చేశారు. తరతరాలుగా వస్తున్న హోలీ రంగుల వేడుకలలో చిన్నారులు పాఠశాలలో ఈ సంవత్సరం కూడా సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా పాఠశాల  కరస్పాండెంట్  చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి మన భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలలో రంగుల కేలి హోలీ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉందని తెలియజేశారు. అలనాడు బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రంగుల సంబరాలు నిర్వహించిన సాంప్రదాయాన్ని ప్రతి ఏటా సాంప్రదాయంగా జరుపుకుంటున్నారు అని తెలిపారు. ఈ హోలీ సంబరాల లో రసాయనిక రంగులను వాడడం ఆరోగ్యానికి హానికరమని, అందుకే సాంప్రదాయ మరియు సహజ రంగులను హోలీ వేడుకలలో ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .