ఎస్సీ కాలనీలో నూతన త్రాగు నీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం
Views: 14
On
వేలేరు, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ కాలనీలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మంచి నీళ్ల బావి నుంచి వాటర్ ట్యాంక్ వరకు నూతన పైప్‌లైన్ పనులను సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు ప్రారంభించారు.
వేసవిలో నీటి కొరత లేకుండా నిరంతరాయంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి కాలనీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డు సభ్యులు గుడికందుల రాకేష్, జెరుపోతుల జగన్, రామంచ ప్రశాంత్, ఎస్సీ కాలనీ అధ్యక్షుడు ఏలూరి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments