నారాయణ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

నారాయణ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

వనపర్తి,ఫిబ్రవరి28(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణంలోని నారాయణ పాఠశాలలో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ మద్దిలేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాస్త్ర సాంకేతిక అంశాలతో రూపొందించిన ప్రదర్శనను ఆయన పరిశీలించారు.సైన్స్ ఆధారిత ప్రాజెక్టులు, విద్యార్థుల సృజనాత్మకతను ప్రతిబింబించే ప్రయోగాలు, లైవ్ మోడల్స్, వర్కింగ్ మోడల్స్, జంతువుల ద్వారా సేకరించిన లైవ్ ఆర్గాన్స్ వంటి విభిన్న రకాల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రాజెక్టు వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను విద్యార్థులు స్పష్టంగా వివరించడంతో ఎంఈఓ అభినందనలు తెలిపారు.IMG-20260228-WA0134ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మద్దిలేటి ప్రశంసిస్తూ, శాస్త్ర విజ్ఞానం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ భయందర్ గౌడ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .