ఎల్కతుర్తి లో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉత్సవ కమిటీ ఏర్పాటు

ఎల్కతుర్తి లో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉత్సవ కమిటీ ఏర్పాటు

ఎల్కతుర్తి, మార్చి 1:( తెలంగాణ ముచ్చట్లు) 

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నూతన ఉత్సవ కమిటీని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2026 సంవత్సరం ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో జరగనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ పెద్ద పండుగను ఘనంగా నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపికైన ఉత్సవ కమిటీ సభ్యులు: జనగాని సురేష్ గౌడ్, గోడిశాల విజయ్ కుమార్ గౌడ్, గోడిశాల నరేష్ గౌడ్, కొత్తకొండ శ్రీకాంత్ గౌడ్, జనగాని లక్ష్మీనారాయణ గౌడ్, శ్రీపతి భిక్షపతి గౌడ్, సోషల్ మీడియా ప్రతినిధి జనగాని ప్రవీణ్ గౌడ్, గోడిశాల అర్జున్ గౌడ్.
కమిటీ సభ్యులు దేవాలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన, ఉత్సవాల సమర్థ నిర్వహణ వంటి అంశాల్లో సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. పెద్ద పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు.
శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు పరమ పవిత్రమైన శక్తి స్వరూపిణిగా భక్తుల విశ్వాసానికి నిలయంగా ఉన్నారు. పురాణాల ప్రకారం రేణుకాదేవి మహర్షి జమదగ్ని మహాముని పత్నిగా, పరశురాముని తల్లిగా ప్రసిద్ధి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రేణుక ఎల్లమ్మ జాతరలు వైభవంగా జరుగుతుంటాయి.
పెద్ద పండుగను విజయవంతం చేయడానికి గ్రామస్థులు, భక్తులు అందరూ సహకరించాలని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

పీచర గ్రామంలో ఎడపేల్లి రాజమ్మకు నివాళులు అర్పించిన డా. తాటికొండ రాజయ్య పీచర గ్రామంలో ఎడపేల్లి రాజమ్మకు నివాళులు అర్పించిన డా. తాటికొండ రాజయ్య
వేలేరు, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఎడపేల్లి రాజమ్మ మరణించగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్...
పీచర గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ పెద్ద పండగకు ఘన ఏర్పాట్లు
అంకమ్మ తల్లి తిరునాళ్లకు కోమట్లగూడెం సిద్ధం
కరాటే ఛాంపియన్  సన్మానించిన డాక్టర్స్ 
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌
పోలీస్ శిక్షణ కేంద్రంలో ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన డి జి పి 
లాల్ బహాదుర్ స్మారక యువజన సంఘం నూతన భవన ప్రారంభోత్సవం