జన్ ఔషధి దివస్ సందర్భంగా మల్కాజిగిరిలో హెల్త్ చెకప్ క్యాంపులు ప్రారంభం.

జన్ ఔషధి దివస్ సందర్భంగా మల్కాజిగిరిలో హెల్త్ చెకప్ క్యాంపులు ప్రారంభం.

మేడ్చల్–మల్కాజిగిరి, మార్చి 1 (తెలంగాణ ముచ్చట్లు):

 8వ ప్రధాన మంత్రి జన్ ఔషధి దివస్ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై హెల్త్ చెకప్ క్యాంపులను ప్రారంభించారు.మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన ఔషధాలు అందించేందుకు జన్ ఔషధి పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. సామాన్య ప్రజలు ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గిరి, మాజీ కార్పొరేటర్ పవన్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అలాగే తిరుమలగిరిలో బీజేపీ ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మరో హెల్త్ చెకప్ క్యాంపును కూడా ఎంపీ ప్రారంభించారు.IMG-20260301-WA0073 ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .