మానవ మనుగడకు సైన్స్ కీలకం: ఎమ్మెల్యే మట్టా రాగమయి.

విశ్వశాంతి విద్యాలయంలో ఘనంగా ముగిసిన సైన్స్ వారోత్సవాలు.

మానవ మనుగడకు సైన్స్ కీలకం: ఎమ్మెల్యే మట్టా రాగమయి.

సత్తుపల్లి, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు): 

మానవ మనుగడకు సైన్స్ కీలకమని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం (ఫిబ్రవరి 28) పురస్కరించుకుని స్థానిక పట్టణంలో విశ్వశాంతి విద్యాలయంలో నిర్వహించిన సైన్స్ వారోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఎక్స్‌పోలో విద్యార్థులు రూపొందించిన సుమారు 200 ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రదర్శనలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సైన్స్‌పై ఆసక్తి పెరుగుతాయని తెలిపారు. చిన్ననాటి నుంచే లక్ష్యం ఏర్పరచుకుని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రెహనా బేగం కమల్, వైస్ చైర్మన్ బొంతు సుమలత మాట్లాడుతూ మానవ మనుగడ సైన్స్‌తోనే ముడిపడి ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు కమల్ పాష, వార్డ్ కౌన్సిలర్ అపర్ణ తదితరులు విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు.
కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారుIMG-20260227-WA0083IMG-20260227-WA0084

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .