సాయి దామంలో బజరంగ్ దళ్ శిక్షణ వర్గ ఏర్పాట్లపై సమీక్ష

సాయి దామంలో బజరంగ్ దళ్ శిక్షణ వర్గ ఏర్పాట్లపై సమీక్ష

_కుషాయిగూడలో 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని సందర్శించిన జాతీయ అధ్యక్షుడు కిషన్ ప్రజాపతి

_హిందువుల ఐక్యతే సమాజ బలం అని కార్యకర్తలకు పిలుపు

కుషాయిగూడ, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):

మార్చి 7 నుంచి 14 వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సాయి దామంలో నిర్వహించనున్న అఖిలభారత బజరంగ్ దళ్ శిక్షణ వర్గ (శిబిరం) ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా జాతీయ అధ్యక్షుడు కిషన్ ప్రజాపతి కుషాయిగూడకు విచ్చేసి స్థానిక నాయకులతో సమావేశమై శిబిర ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కుషాయిగూడ బస్ స్టాప్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆయన సందర్శించారు. అనంతరం శివాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.తదనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ యువత ధర్మ మార్గంలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ‘లవ్ జిహాద్’ పేరుతో జరుగుతున్న ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హిందువులను కులాల వారిగా విభజించి ఐక్యతను దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, హిందువులంతా సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దక్షిణ భారత్ బజరంగ్ దళ్ సంయోజక్ కుమారస్వామి, తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు రమేష్ బాబు, తెలంగాణ రాష్ట్ర బజరంగ్ దళ్ సంయోజక్ శ్రీకాంత్, భాగ్యనగర్ సంయోజక్ విశాల్, కుషాయిగూడ ప్రఖండ ప్రముఖ సాకేత్ అరుణ్, యశ్వంత్ సాగర్, రాగిరి వరుణ్ సాకేత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు సురేందర్ గౌడ్, ఆనంద్ గౌడ్, రేగొండ వెంకులు, లక్ష్మణ్ గౌడ్, గణేష్ గౌడ్, వెంకటాచలం, జీవీఎన్ రావు, సంపత్ రావు, సహదేవ్ గౌడ్, పిట్టల రాజు, దయానంద్, అప్పి, శ్రీకాంత్, శ్రీధర్, సోమేశ్ నాయుడు, కళావతి తదితరులు హాజరయ్యారు.శిక్షణ వర్గం విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.IMG-20260227-WA0035

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .