వల్లభాపూర్‌లో కల్లు గీత సంఘం ఎన్నికలు విజయవంతం

వల్లభాపూర్‌లో కల్లు గీత సంఘం ఎన్నికలు విజయవంతం

ఎల్కతుర్తి. ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):

హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామంలో కల్లు గీత సహకార సంఘం ఎన్నికలు శాంతియుత  వాతావరణంలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం భవనంలో ఎన్నికల అధికారి రావుల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా చిర్ర చక్రపాణి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చిర్ర రవీందర్ గౌడ్, క్యాషియర్‌గా మామిడి సారంగపాణి గౌడ్ ఎన్నికయ్యారు.
ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు అభినందిస్తూ సంఘ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.
సంఘ బలోపేతం, కార్మికుల సంక్షేమం, పారిశ్రామిక పురోగతి దిశగా సమిష్టిగా పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .