ఈసీఐఎల్ చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’ ఫేజ్–2 నిర్వహణ
కుషాయిగూడ, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తా వద్ద “అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026” (ఫేజ్–2) కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ డివిజన్ ఏసీపీ వై. వెంకట్ రెడ్డి హాజరై వాహనదారులకు రోడ్డు నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాలు, కుటుంబాలపై పడే ప్రభావం, చట్టపరమైన చర్యలు మరియు ప్రాణనష్టం వంటి అంశాలను నొక్కి చెప్పారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల క్షణిక నిర్లక్ష్యం జీవితాంతం బాధకు దారితీస్తుందని హెచ్చరించారు.కుషాయిగూడ పీఎస్ ఎస్‌హెచ్‌ఓ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్సైలు ఎన్. సుధాకర్ రెడ్డి, ఎన్. వెంకన్న, సిహెచ్. సాయిలు, ఎం. విజయ్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.సుమారు 50–60 మంది వాహనదారులు, స్థానికులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పొందారు.ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ఏడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్‌లో భాగంగా నగరంలోని పలు ముఖ్య కూడళ్లలో అవగాహన ర్యాలీలు, ప్రత్యేక తనిఖీలు, ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.“సురక్షితంగా ప్రయాణించండి – సురక్షితంగా గమ్యానికి చేరుకోండి” అనే సందేశంతోఈ కార్యక్రమం కొనసాగుతోంది.


Comments