వనపర్తిలో జీవనగమనం పుస్తక ఆవిష్కరణ
వనపర్తి,ఫిబ్రవరి25(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర పాఠశాలలో ‘జీవనగమనం’ కవితా సంకలన పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు ఉపాధ్యాయులు కీర్తిశేషులు శేఖర్ రచించిన కవితలను ఆయన అర్ధాంగి శ్రీమతి హెప్సిబా సంకలన రూపంలో తీసుకొచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ గని ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కవితలు, కథలు రాసే నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు పెంపొందించాలని సూచించారు.బాలసాహిత్యంపై ఆసక్తి కల్పించి, విద్యార్థుల రచనలను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరారు.సభాధ్యక్షులు జనజ్వాల మాట్లాడుతూ.. సమ సమాజ నిర్మాణానికి దోహదపడేదే నిజమైన కవిత్వమని పేర్కొన్నారు.శేఖర్ ఆలోచనలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు.సంపాదకులుగా డాక్టర్ కంటే నిరంజనయ్య కృషి చేసి మూడు నెలల్లో పుస్తకాన్ని తీసుకురావడం విశేషమన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల శివాజీ మాట్లాడుతూ.. విద్యార్థులు కవితా, కథా పుస్తకాలు చదవడం ద్వారా రచనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సాహిత్య కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. సాహిత్యం ప్రజాపక్షంగా ఉండి సమాజాన్ని మేల్కొల్పేదిగా ఉండాలని అన్నారు.సాహితీవేత్త కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. బాలల సాహిత్యం దేశానికి మలుపు కావాలని ఆకాంక్షించారు.రిటైర్డ్ ఎంఈఓ బత్తుల శ్రీనివాసులు మాట్లాడుతూ.. సాహిత్యం ప్రజా చైతన్యానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రతిబింబించేదే నిజమైన సాహిత్యమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ పుస్తక సమీక్ష నిర్వహించి సభికులను అలరించారు.పుస్తకంలోని సామాజిక, రాజకీయ, విద్యా అంశాలపై కవితలు ఉన్నాయని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ గని, ప్రధానోపాధ్యాయులు ఆకుల శివాజీ, జనజ్వాల, రాజారాం ప్రకాష్, పలుస శంకర్ గౌడ్, డాక్టర్ బండారు శ్రీనివాస్, గణేష్, చంద్రశేఖర్, బౌద్ధారెడ్డి, రవీందర్ గౌడ్, రవి ప్రసాద్ గౌడ్, మహిపాల్ రెడ్డి, వరప్రసాదరావు, కిరణ్ కుమార్, హెప్సిబా, డాక్టర్ కంటే నిరంజనయ్య, గంధం నాగరాజు, బత్తుల శ్రీనివాసులు తదితరులు, ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments