పీచర గ్రామంలో హామీల అమలు – సర్పంచ్ మరిజె అనిత నర్సింహారావు

పీచర గ్రామంలో హామీల అమలు – సర్పంచ్ మరిజె అనిత నర్సింహారావు

వేలేరు, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన పోచవ్వ–రమేష్‌ల కుమార్తె మమత వివాహం సోడాషాపల్లి ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీచర గ్రామ సర్పంచ్ మరిజె అనిత నర్సింహారావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
ఎన్నికల వేళ గ్రామంలోని ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ. 5,116 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించిన ఆమె, మమత వివాహ సందర్భంగా ఆ మొత్తాన్ని అందజేశారు. ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తుండటంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డు సభ్యులు కొలిపాక వెంకటేష్, ఉప్పుల శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .