ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మేడ్చల్ మల్కాజ్గిరి, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా పరిశీలించారు.శామీర్‌పేట్ మండలంలోని తూంకుంటలో ఉన్న సాయితేజ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ, ఉప్పర్‌పల్లిలోని ఎక్సెలెన్సియా జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, పరీక్షల నిర్వహణ విధానాన్ని సమీక్షించారు.ఈ సందర్భంగా పరీక్షా గదులను సందర్శించి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. పరీక్షలు ముగిసే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, ఫ్యాన్లు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.పరీక్షా కేంద్రంలో హాజరైన విద్యార్థుల సంఖ్య, గైర్హాజరు వివరాలను సేకరించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి, డిస్‌ప్లే రూమ్‌ ద్వారా ప్రతి గదిని పరిశీలించారు. ప్రశ్నా పత్రాలు నిర్ణీత సమయానికే తెరిచారా, ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి ఇచ్చారా వంటి అంశాలపై కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.ఈ పర్యటనలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్, శామీర్‌పేట్ తహసీల్దారు సుచరిత తదితరులు పాల్గొన్నారు.IMG-20260225-WA0043

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .