మేఘన్న అభయ హస్తం – బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

మేఘన్న అభయ హస్తం – బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

పెద్దమందడి,ఫిబ్రవరి25(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎర్రబాలయ్య (తండ్రి: ఎరన్న) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  కుటుంబానికి నాయకుల ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  తరపున పార్టీ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల నిర్వహణకు రూ.5,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం, మాజీ సర్పంచ్ సిద్దయ్య, మాజీ ఎంపిటిసి ఇందిరా లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు నరేష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .