పిల్లల ఆహారంలో నిర్లక్ష్యం అస్సలు వద్దు
మోజర్ల గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్
Views: 13
On
పెద్దమందడి,ఫిబ్రవరి25(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో ఉన్న రెండు అంగన్వాడీ కేంద్రాలను మోజర్ల గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పిల్లలు తీసుకుంటున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేకంగా ఆరా తీశారు.పిల్లల ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని వంట సిబ్బందిని హెచ్చరించారు.శుభ్రత, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు.అదేవిధంగా రోజువారీ భోజన మెనూను పరిశీలించిన సర్పంచ్, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా గుడ్లు, పాలు వంటి పోషకాహార పదార్థాలు ప్రతి చిన్నారికి అందేలా చూడాలని అంగన్వాడీ టీచర్లకు ఆదేశించారు. పిల్లల ఆరోగ్యం, అభివృద్ధి విషయంలో రాజీ ఉండబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments