కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

అధ్యక్ష–కార్యదర్శులుగా మెరుగు చంద్రమోహన్, ముత్యం ముఖేష్ గౌడ్

కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

కాప్రా, ఫిబ్రవరి 25 ( తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు బుధవారం టిఎస్ఐఐసీ కాలనీలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏకగ్రీవంగా నిర్వహించారు. సమావేశంలో సభ్యుల సమక్షంలో కమిటీని ప్రకటించారు.సలహాదారులుగా ఏంపల్లి పద్మారెడ్డి, బెలిదే అశోక్‌లను ఎన్నుకోగా, అధ్యక్షుడిగా మెరుగు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శిగా ముత్యం ముఖేష్ గౌడ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా దిలీప్ కుమార్, యావాపురం రవి, దొమ్మాటి కిరణ్ కుమార్, గార్లపాటి శ్రీనివాస్ రావు బాధ్యతలు స్వీకరించారు. సంయుక్త కార్యదర్శులుగా డి. శ్రీనివాస్, కె. వెంకట్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఓ. నరసింహ, కీర్తి శ్రీనివాస్, కోశాధికారిగా రామచంద్రమూర్తి, కార్యవర్గ సభ్యులుగా గంగి కృష్ణ, గోవిందు కుంట్ల ఆంజనేయులు, బుడంపల్లి నిరంత్ గౌడ్, తొడుపునూరు బాలకృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు మెరుగు చంద్రమోహన్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి ముత్యం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ సభ్యుల ఐక్యతతో ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. కోశాధికారి రామచంద్రమూర్తి పారదర్శక ఆర్థిక నిర్వహణకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.నూతన కమిటీకి అభినందనలు నూతన కమిటీకి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారితో పాటు కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో కమిటీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.IMG-20260225-WA0037

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .