కీసరలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం. 

339 మంది విద్యార్థులు హాజరు

కీసరలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం. 

కీసర, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు): 

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యాయి. కీసరలోని శ్రద్ధ కళాశాల పరీక్షా కేంద్రంలో మొదటి రోజు 339 మంది విద్యార్థులు హాజరయ్యారు.పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి, హాల్ టికెట్ మరియు గుర్తింపు కార్డులు పరిశీలించిన అనంతరం మాత్రమే లోపలికి అనుమతించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.పరీక్షలు ఉదయం సమయానికి ప్రారంభం కాగా, 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ముగిసేలోపు చివరి నిమిషంలో కేంద్రానికి చేరుకున్న కొందరు విద్యార్థులు కంగారుపడుతూ హాళ్లకు చేరుకున్నారు. కేంద్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు.IMG-20260225-WA0031

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .