మద్దిగట్ల–మోజర్ల ప్రభుత్వ పాఠశాలలో సర్పంచుల సమీక్ష సమావేశం

పదవ తరగతి ఫలితాల మెరుగుదలపై దృష్టి

మద్దిగట్ల–మోజర్ల ప్రభుత్వ పాఠశాలలో సర్పంచుల సమీక్ష సమావేశం

పెద్దమందడి,ఫిబ్రవరి27(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం  మద్దిగట్ల–మోజర్ల జిల్లా పరిషత్ పాఠశాలను మద్దిగట్ల గ్రామ సర్పంచ్ మేకల రాములు,మోజర్ల గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ పర్యటించి పదవ తరగతి విద్యార్థుల బోధన విధానం, విద్యా ప్రమాణాలు మరియు ప్రతిభా పాటవాలను పరిశీలించారు. పదవ తరగతి ఫలితాల మెరుగుదల లక్ష్యంగా ఉపాధ్యాయులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.విద్యార్థుల విద్యా పురోగతిపై వివరాలు తెలుసుకుని, బలహీన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఉత్తీర్ణత శాతం పెంపుతో పాటు మెరుగైన గ్రేడ్‌లు సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు, ఉపాధ్యాయులు డి. రణదీవ్, పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, పుల్లయ్య, ఏ. వెంకటస్వామి, వాణి ప్రభ, శ్రీనివాసులు, ఎన్. వెంకటస్వామి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.పాఠశాల అభివృద్ధికి గ్రామస్థుల సహకారం కీలకమని, సమష్టి కృషితో పదవ తరగతి ఫలితాల్లో మెరుగైన విజయాలు సాధించాలని సర్పంచులు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .