ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో రామిడి విజయ్ రెడ్డి పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో రామిడి విజయ్ రెడ్డి పాల్గొన్నారు

_ కీసర డివిజన్-1లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ
_రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పేదలకు సొంతింటి కల సాకారం

కీసర, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ నియోజకవర్గం జిహెచ్ఎంసి మల్కాజ్గిరి కీసర సర్కిల్ కీసర డివిజన్-1 పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సీనియర్ మాజీ మండల్ వర్కింగ్ అధ్యక్షులు రామిడి విజయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పెడుచుట్టి సదానందం నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించారు.అదేవిధంగా తోకటి పద్మకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీని అందజేశారు.ఈ సందర్భంగా విజయ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని “ఇందిరమ్మ ఇళ్లు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తోందని తెలిపారు.గతంలో ఇందిరా గాంధీ పేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమాల స్ఫూర్తితోనే ఈ పథకం కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవంతో కూడిన నివాసం కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాజలింగం గౌడ్, సురేష్ గౌడ్, బండారి ఇలేష్, తాళ్ల భాగ్యమ్మ, తోకటి లలిత, మాజీ సర్పంచ్ యాదయ్య, కుమార్, అంజనయులు, సంతోష్ గౌడ్, సత్యనారాయణ, భికపతి, జిహెచ్ఎంసి కీసర డివిజన్-1 ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.IMG-20260227-WA0091

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .