కాప్రా ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షుడిగా జ్యోతిర్మయ చారి, ప్రధాన కార్యదర్శిగా ఆదిమూలం శ్రీనివాస్
కాప్రా, ఫిబ్రవరి 26 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కాప్రా ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా సీనియర్ జర్నలిస్టుల సంఘం - రిజిస్టర్ నం. 489/2020) నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ భవనంలో నిర్వహించిన సమావేశంలో సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో నూతన కమిటీని ఎంపిక చేశారు.అధ్యక్షుడిగా జ్యోతిర్మయ చారి (వార్త చారి), ప్రధాన కార్యదర్శిగా ఆదిమూలం శ్రీనివాస్ (సాక్షి), కోశాధికారిగా వట్టిపల్లి సురేష్ (జనం సాక్షి) ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను కాప్రా డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ఎస్సై సుధాకర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.నూతన కమిటీ సభ్యులు జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన తోటి జర్నలిస్టులందరికీ నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సలహాదారులు కడియాల రమేష్ (నమస్తే తెలంగాణ), కె.సి. మోహన్ (నమస్తే తెలంగాణ), చంద్రమౌళి (ఈనాడు), క్యాసని సత్యనారాయణ సాగర్ (నవతెలంగాణ), సహదేవా చారి (ఆంధ్రజ్యోతి), ఉల్లోజు శ్రీనివాస్ (ఆంధ్రప్రభ)తో పాటు సీనియర్ జర్నలిస్టులు భాస్కర్ రెడ్డి, గడ్డమీది బాలరాజ్ గౌడ్, సిరా శ్రీనివాస్, విజయ్, శంకర్, లక్కిడి బాల్ రెడ్డి, పలుగుల పవన్, అనిల్, సాంబశివుడు, సురేందర్, నర్సింగ్ గౌడ్, ప్రసాద్, రోజా రాణి, రాము తదితరులు పాల్గొన్నారు.


Comments