ఉప్పల్ మీడియా క్లబ్ నూతన కమిటీకి ఘన సత్కారం
సేవా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
ఉప్పల్, ఫిబ్రవరి 26 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్ మీడియా క్లబ్ (ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ) నూతన కమిటీ సభ్యులను గురువారం తన నివాసంలో ఆహ్వానించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్ కార్యాచరణకు తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ, సుమారు 35 సంవత్సరాల తరువాత ఉప్పల్‌లో సీనియర్ జర్నలిస్టు వడ్డేపల్లి కిషోర్ నాయకత్వంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు ఐకమత్యంతో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నూతన కమిటీ సభ్యులు స్నేహబంధంతో, సమన్వయంతో ముందుకు సాగుతూ మీడియా ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆకాంక్షించారు.కమిటీకి అవసరమైన సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం వద్ద తాను కృషి చేస్తానని తెలిపారు. మీడియా నిష్పక్షపాత ధోరణితో ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.మీడియా క్లబ్ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని బేతి సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో ఉప్పల్ బీజేపీ అధ్యక్షుడు మారినేని ఫణిందర్, ప్రధాన కార్యదర్శి తీగ విట్టల్ రావు మరియు ఉప్పల్ మీడియా క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments