మల్లాపూర్‌లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు భూమిపూజ

మల్లాపూర్‌లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు భూమిపూజ

_రూ.1.8 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం.

– ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచాలి: ఈటల రాజేందర్

మల్లాపూర్, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):

 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు కొత్త భవన నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధుల కింద రూ.1.8 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణ పనులను టెక్నిప్ ఎఫ్‌ఎంసి సంస్థ, అమలు భాగస్వామి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా ఆధ్వర్యంలో చేపడుతున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్,  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక మాజీ కార్పొరేటర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కష్టం తెలియని వారు అధికారులైతే మానవతా దృక్పథం లోపిస్తుందని అన్నారు. పేదరికం నుంచి వచ్చినవారికి ప్రజల సమస్యలు బాగా అర్థమవుతాయని, వారు సేవాభావంతో పనిచేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారని, వాటి అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, సంస్థలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లే తాను కూడా పేద విద్యార్థులకు, ముఖ్యంగా వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నానని తెలిపారు. విద్యాభివృద్ధి కోసం ప్రజలు, సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.కొత్త భవనంతో విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్య అందుబాటులోకి వస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.IMG-20260227-WA0070

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .