రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’

రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’

- కొత్తూరులో 67 ఇళ్లతో సామూహిక గృహప్రవేశాలు.
- పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి ఆధునిక వసతులతో నిర్మాణం.

సత్తుపల్లి, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో నిర్మించిన 67 ఇందిరమ్మ ఇళ్ల సముదాయానికి “ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ”గా నామకరణం చేస్తూ శుక్రవారం సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే వారి పేరుతో కాలనీకి నామకరణం చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
గతంలో “రేకుల కాలనీ”గా ఉన్న ఈ ప్రాంతం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నూతన రూపు సంతరించుకుంది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ హాజరై లబ్ధిదారులను గృహాల్లోకి పంపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా కొత్తూరును పైలెట్ ప్రాజెక్ట్ గ్రామంగా ఎంపిక చేసి కాలనీని నిర్మించినట్లు తెలిపారు. గ్రామ పెద్దలు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు అందించామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలతో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకుంటుండటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎంపీIMG-20260227-WA0092IMG-20260227-WA0094డీవో, ఎంఆర్‌వో, హౌసింగ్ ఏఈ, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .