మాణిక్యమాయ్య గుట్టపై శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ జాతర

పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

మాణిక్యమాయ్య గుట్టపై శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ జాతర

మేడ్చల్–మల్కాజ్‌గిరి, మార్చ్  01 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని కాచవాని సింగారం గ్రామంలోని మాణిక్యమాయ్య గుట్టపై నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి మరియు రేణుక ఎల్లమ్మ జాతర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు, దేవస్థానం కమిటీ సభ్యులు ఎంపీకి సన్మానం చేసి శాలువాతో సత్కరించారు. భక్తులతో కలిసిమెలిసి జాతర వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వాటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామ దేవతల ఆశీర్వాదాలతో ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు గుట్టపైకి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. భజనలు, అन्नదానం, సాంప్రదాయ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయIMG-20260301-WA0078 ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .