దివ్వఖురాన్ సర్వమానవాళికి మార్గదర్శకం
జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాదిక్ అహ్మద్
ఖమ్మం బ్యూరో, మార్చి 1(తెలంగాణ ముచ్చట్లు)
సర్వమానవాళి మార్గదర్శకత్వం కోసం దివ్వగ్రంధమైన దివ్వఖురాన్ రంజాన్‌నెలలో అవతరించిందని జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాదిక్ అహ్మద్ అన్నారు. స్దానిక కార్యలయంలో నగర అధ్యక్షులు జైనుల్ పాషా అధ్యక్షుతన జరగిన కార్యకర్తల సమావేశంలో సాదిక్ అహ్మద్ మాట్లాడుతు దివ్వఖుర్‌ఆన్ కేవలం ముస్లీం కోసమే అవతరించిన గ్రంధం కాదని సర్వమానవాళికి రూజుమార్గం చూపి సత్య సత్యలను వేరుపరిచి చెప్పటానికి దైవం తన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్(స) పై అవతరింప చేశాడని తెలియచేసారు.ఈ దివ్వఖురాన్‌ఆవతరణ రమజాన్‌మాసంలోనే జరిగిందనీ ఇందుకోసమే ఈ మాసంలో ముస్లీములు దైవానికి కృతజతలు తెలుపడానికి ఉపవాసాలు పాటిస్తారని తెలిపారు. ఇస్లాం మౌళిక భోధనలైన ఏకేశ్వరోపాసన, దైవదౌత్యం, పరలోకం యొక్క బోధనలలో పాటు సమసమాజ స్ధాపన, శాంతి,న్యాయం,పేమ, సౌభ్రాత్వత్వాల ఆధారంలో నిర్నితమయ్యే సమాజానికి పునాదులు వేస్తుందని తెలిపారు. దివ్వఖురాన్ మనిషి పరిపూర్ణ జీవన విధానానికి దిక్సూచి వంటిదని అన్నారు. అనంతరం కోత్తగూడెం జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి సంపన్న ముస్లిం విధిగా తన సంపదలో నుంచి దానం (జకాత్) చేస్తే ఆర్థిక అసమానతులను నిర్మించవచ్చని అన్నారు ఎవరి వద్ద ఏడున్నర తులాల బంగారము 52 తులాల వెండి ఉంటే దానికి సమానమైన సంపద ఉంటే వారు తప్పనిసరిగా రెండున్నర శాతం జకాత్ పేదలకు చెల్లించాలన్నారు జకాత్ వ్యక్తి సంపదను శుద్ధి చేస్తుందని అన్నారు .ఈ కార్యాక్రమములో జమాఅతె ఇస్లామి హింద్ సెంట్రల్ అధ్యక్షులు ఇంతియాజ్,సౌత్ అధ్యక్షులు సయ్యద్ నిజాముద్దీన్, నార్త్ అధ్యక్షులు మొహమ్మద్ యూసుఫ్ షరీఫ్, వెస్ట్ అధ్యక్షులు అబ్దుస్ సుబుర్ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ మతిన్ జమాఅతె ఇస్లామి హింద్ సభ్యులు ఖలీల్ అహ్మద్ ఖాన్, అబ్దుల్ ముజీబ్, అబ్దుల్ మలిక్, అబ్దుల్ సమి, ఫయాజ్ ,అబ్దుల్ రజాక్ , లతీప్, ఇలియాస్, అబ్దుల్ రహీం, హాది, గౌస్,మొయినుద్దీన్, ఇబ్రహీం షరీఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు


Comments