వనస్థలిపురంలో వంగవీటి మోహన రంగ కాంస్య విగ్రహావిష్కరణ

వనస్థలిపురంలో వంగవీటి మోహన రంగ కాంస్య విగ్రహావిష్కరణ

మేడ్చల్ మల్కాజ్‌గిరి , మార్చ్ 01 ( తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లావనస్థలిపురం కాపు సంఘ భవన ఆవరణలో స్వర్గీయ వంగవీటి మోహన రంగ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, వంగవీటి మోహన రంగ సామాజిక న్యాయం, కాపు సమాజ అభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు యువతకు స్ఫూర్తిదాయకమని, సమాజ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రంగా కుమారుడు వంగవీటి రాధా, కాపు సంఘం నాయకులు, వంగవీటి అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.విగ్రహావిష్కరణతో ప్రాంతంలో కాపు సమాజంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. కార్యక్రమం శాంతియుతంగా విజయవంతమైంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .