మల్లికార్జున నగర్‌లో డ్రైనేజీ పనుల ఆలస్యం

బస్తీ బాటలో పరిశీలించిన కాంగ్రెస్ నాయకుడు నెమలి అనిల్ కుమార్

మల్లికార్జున నగర్‌లో డ్రైనేజీ పనుల ఆలస్యం

మల్లాపూర్, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ శక్తిసాయి నగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్‌లో గత ఆరు నెలలుగా కొనసాగుతున్న డ్రైనేజీ పనులు పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రహదారులు తవ్వి వదిలేయడంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు, వృద్ధులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యను గుర్తించిన కాంగ్రెస్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ “బస్తీ బాట” కార్యక్రమంలో భాగంగా మల్లికార్జున నగర్‌లో పర్యటించి, పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడి పరిస్థితులను గమనించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. పనుల్లో నిర్లక్ష్యం అసలు సహించబోదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ,
“ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోలేం. పనుల్లో జాప్యం అనుమతించం. వెంటనే పనులు పూర్తి చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవాదళ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సద్గుణ, మల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మక్తాల బాలరాజ్ గౌడ్, వుండం శ్రీనివాస్, లక్ష్మీపతి, సురేష్ గౌడ్, కంపెల్లి శివ, అన్వర్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బాతరాజు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి కావాలని స్థానికులు కోరుతున్నారు.IMG-20260301-WA0105

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .