నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఎస్ ఆర్ డి జి స్కూల్ సైన్స్ మార్చ్ నిర్వహించారు

నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఎస్ ఆర్ డి జి స్కూల్ సైన్స్ మార్చ్ నిర్వహించారు

కుషాయిగూడ, ఫిబ్రవరి 28 (తెలంగాణ ముచ్చట్లు): 

నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని ఎస్ ఆర్ విద్యాసంస్థలకు చెందిన ఎస్ ఆర్ డి జి స్కూల్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఘనంగా సైన్స్ మార్చ్ నిర్వహించారు.భారతరత్న సర్ సి.వి. రామన్ కనుగొన్న ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణ విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాంతికిరణాల వ్యాప్తిపై ఆయన చేసిన పరిశోధనలు విజ్ఞానరంగానికి విశేష కీర్తి తీసుకువచ్చాయి. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రముఖ శాస్త్రవేత్తల చిత్రపటాలు చేతబూని విజ్ఞాన ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ సైన్స్ మార్చ్ చేపట్టారు. ఎస్ ఆర్ డి జి స్కూల్ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ మార్చ్ కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియా, తాళ్లూరు సినిమా గుండా ఈసీఐఎల్ చౌరస్తా వరకు కొనసాగింది. వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎస్ ఆర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా ఈ సైన్స్ మార్చ్‌లో పాల్గొన్నారు.స్కూల్ ప్రిన్సిపాల్ జి. ప్రవీణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని సూచించారు. విద్యార్థులు విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకుని భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్వర్ణలత, మెరిట్ ఇన్‌చార్జ్ పరమేశ్వర్ రెడ్డి, ఎస్ ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20260228-WA0188

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .