కాకరవాయిలో కొవ్వొత్తుల ప్రదర్శన… పసిపాపకు ఘన నివాళి.

కాకరవాయిలో కొవ్వొత్తుల ప్రదర్శన… పసిపాపకు ఘన నివాళి.

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 28(తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కాకరవాయి గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ ల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో రజకులపై జరిగిన దాడిలో రెండు నెలల పసిపాపను కాలితో తన్ని ప్రాణాలు తీసిన అగ్రవర్ణ నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. అమాయక శిశువు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ గ్రామస్తులు మౌనంగా నివాళులు అర్పించారు.గ్రామ ప్రధాన వీధులలో శాంతియుతంగా సాగిన ఈ ప్రదర్శనలో మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిందితులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి అమానుష ఘటనలు సమాజంలో పునరావృతం కాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడూరు ఉపేందర్, వార్డు సభ్యులు కొత్తపల్లి వసంతరవి రజక, కొత్తపల్లి ఉష రవి రజక, నల్లగట్టు శంకర్ మహారాజ్, కొత్తపల్లి మధు రజక, ఏనుగంటి కృష్ణ రజక, దామెర్ల కృష్ణ రజక, ఏనుగంటి లింగయ్య రజక, దామెర్ల సతీష్ రజక, బాలమ్మ వెంకన్న రజక, కొత్తపల్లి లింగయ్య రజక, కొత్తపల్లి చిన్న మధు రజక, ధోనిపల్లి రాము రజక, కొత్తపల్లి రామస్వామి రజక, కొత్తపల్లి అబ్బుచంద్రు సత్యం రజక, కొత్తపల్లి చిన్నారాములు మల్లయ్య, కొత్తపల్లి హరీష్, కొత్తపల్లి నవీన్, కొత్తపల్లి యల్లమ్మ, కొత్తపల్లి అబ్బు చంద్రు వెంకన్న, గుండగాని వెంకటనారాయణ గౌడ్, సురిగి వెంకన్న గౌడ్, కొత్తపల్లి మల్లయ్య, వీరబోయిన ఉప్పయ్య యాదవ్, కొత్తపల్లి నర్సమ్మ, వీరబోయిన గొల్ల పుల్లమ్మ మహేష్ యాదవ్, పచ్చిపాల గణేష్ యాదవ్, శాలిగంటి సతీష్, మోర శశి, వీరబోయిన మధుకర్ యాదవ్, ధర్మపూరి ముత్తయ్య, నల్లగట్టు కార్తీక్, నల్లగట్టు బిక్షం, మక్కాల యల్లయ్య, వీరబోయిన ఉమశంకర్ యాదవ్, వీరబోయిన యలమంచిలి యాదవ్, వలగాని రాము గౌడ్, నల్లగట్టు రాజు, మోరపాక ఉమేష్ చంద్ర, సురిగి గణేష్ గౌడ్, కొత్త మహేష్ గౌడ్, నల్లగట్టు పండు, కొత్తపల్లి శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కొత్తపల్లి వసంతరవి రజక, శంకర్ మహారాజ్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పసిపాపకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని గ్రామ ప్రజలు స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News