తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌గా ఎండి రహీం నియామకం

తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌గా ఎండి రహీం నియామకం

హైదరాబాద్,మార్చి01(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి ఎండి రహీంను నియమిస్తూ నియామక పత్రాన్ని సంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి అందజేశారు. తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హాజరైన మలిదశ ఉద్యమకారుల సమక్షంలో ఈ నియామకం జరిగింది.ఈ సందర్భంగా ఎండి రహీం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కన్వీనర్ బాధ్యతలు అప్పగించినందుకు డాక్టర్ పిడమర్తి రవికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలు సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల హామీలలో భాగంగా ఉద్యమకారులకు ప్రకటించిన 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, గుర్తింపు కార్డు వంటి అంశాలు అమలు అయ్యే వరకు మలిదశ ఉద్యమకారులను ఐక్యం చేసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు.రానున్న రోజుల్లో ఉద్యమకారులు ఐక్యంగా నిలిచి రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే ఉద్యమకారుల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .