15వ బెటాలియన్‌లో దుద్దీల్ల శ్రీపాదరావు జయంతి.

15వ బెటాలియన్‌లో దుద్దీల్ల శ్రీపాదరావు జయంతి.

సత్తుపల్లి, మార్చి 2 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక మండల పరిధిలోనీ బి.గంగారం గ్రామం 15వ బెటాలియన్ ప్రాంగణంలో మాజీ శాసనసభ స్పీకర్ దుద్దీల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెటాలియన్ కమాండెంట్ ఎ.అంజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1984లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన శ్రీపాదరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసి, అనంతరం శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించి ఆ పదవికి గౌరవం తీసుకువచ్చారని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహాయ దళాధిపతులు ఎస్.శ్రీధర్ రాజా, బి.వేణుగోపాలరెడ్డి, పరిపాలన అధికారి అశోక్, ఆర్‌ఐ పి.ఉదయ్‌కుమార్, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.IMG-20260302-WA0098

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .